ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్ గేర్" ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఈ ప్రమాదంపై బీబీసీ కూడా స్పందించింది.
సోమవారం ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఫ్రెడ్డీ (ఫ్లింటాఫ్) గాయపడ్డాడు. వెంటనే మెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడికి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది.
త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాం అని బీబీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఫ్లింటాఫ్ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 7315 పరుగులతో పాటు 400 పైగా వికెట్లు సాధించాడు.
చదవండి: FIFA WC 2022 Final: ఫైనల్ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment