
ఐపీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ యాజమాన్యం నియమించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు హెడ్‌కోచ్‌గా కొనసాగిన సంజయ్ బంగర్‌పై ఆర్సీబీ వేటు వేసింది. అదే విధంగా తమ జట్టు డైరక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్‌కు కూడా బెంగళూరు ఉద్వాసన పలికింది.
"ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాం. అతడు ఈ బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోంషంగా ఉందంటూ" ఆర్సీబీ ట్విటర్‌లో పేర్కొంది. కాగా అండీ ఫ్లవర్‌కు దశాబ్ధానికి పైగా కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్,ఫ్రాంచైజీ క్రికెట్‌లో కోచ్‌గా తన సేవలను అందిచాడు.
2010లొ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా ఫ్లవర్ పనిచేశాడు. అదే విధంగా ఐపీఎల్‌లో గత రెండు సీజన్లగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్‌కోచ్‌గా అండీ ఉన్నాడు. అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అతడిని లక్నో విడుదల చేయడంతో, ఆర్సీబీ గూటికి చేరాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో దుమ్మురేపిన ఆర్సీబీ.. ఆఖరిలో మాత్రం చేతులేత్తేసింది. దీంతో ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆరో స్ధానంతో సరిపెట్టుకుంది.
చదవండి:IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment