
సాక్షి, అమరావతి: భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చెస్ ఆటగాళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రష్యా వేదికగా జరిగిన ఫైడ్ ఆన్‌లైన్ చెస్ ఒలంపియాడ్‌లో తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డు సృష్టించింది. కాగా చెస్ ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ, దివ్య, నిహాల్, విదితలు ఫైనల్లో సరైన వ్యూహాలతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్తులో చెస్ ఆటగాళ్లు మరిన్ని విజయాలను అందుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
కాగా భారత్ చెస్ ఒలింపియాడ్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. గతంలో వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసి పట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణంతో సంచలనం సృష్టించింది.
చదవండి: చెస్ ఒలింపియాడ్‌లో భారత్ నయా చరిత్ర