![Argnetina Football Star-Lionel Messi Makes-Inter-Miami-Debut - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/18/Messi.jpg.webp?itok=EADbxxB_)
ఫోర్ట్ లాడెర్‌డేల్ (ఫ్లోరిడా): అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ కొత్త గూటికి చేరాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ‘ఇంటర్ మయామి’ జట్టుతో ఆడేందుకు సోమవారం ఇక్కడికి వచ్చాడు. ఈ క్లబ్‌కు చెందిన స్టేడియంలో అతను ‘10 నంబర్ జెర్సీ’తో ప్రవేశించగానే క్లబ్ సహ యజమాని, ఇంగ్లండ్ సాకర్ స్టార్, మాజీ కెప్టెన్ బెక్‌హామ్ ఆలింగనం చేసుకొని అభిమానుల హర్షధ్వానాల మధ్య స్వాగతం పలికాడు.
2025 సీజన్ పూర్తయ్యే వరకు ఇంటర్ మయామితో ఆడేందుకు మెస్సీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment