
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌మనీ ఆసియా ర్యాపిడ్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అర్జున్ ఇరిగైసి ఆకట్టుకున్నాడు. 16 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రోజు ఐదు రౌండ్ గేమ్‌లు జరిగాయి. ఇందులో అర్జున్ ఒక గేమ్‌లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. 2567 ఎలో రేటింగ్ ఉన్న అర్జున్ తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారులకు గట్టిపోటీ ఇచ్చాడు. జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్–2729), ఆధిబన్ (భారత్–2660), డింగ్ లిరెన్ (చైనా–2799)లతో జరిగిన గేమ్‌లను అర్జున్ ‘డ్రా’ చేసుకున్నాడు. రష్యా జీఎం డానిల్ దుబోవ్ (2714)తో జరిగిన గేమ్‌లో 53 ఎత్తుల్లో గెలిచిన అర్జున్... వ్లాదిస్లావ్ (రష్యా–2704)తో జరిగిన గేమ్‌లో 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. ప్రస్తుతం అర్జున్ 2.5 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నాడు. టోర్నీ రెండో రోజు ఆదివారం మరో ఐదు గేమ్‌లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment