ఆస్ట్రేలియా టూర్‌ను భారత్ ‘ఎ’ జట్టు ఓటమితో ఆరంభించింది. మెక్‌కే వేదికగా ఆ్రస్టేలియా ‘ఎ’ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
ఆసీస్-ఎ బ్యాటర్లలో కెప్టెన్ మెక్‌స్వీనీ(88), బ్యూ వెబ్‌స్టర్(61) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మానవ్ సుత్తార్, ముఖేష్ కుమార్ తలా వికెట్ మాత్రమే సాధించారు.
సుదర్శన్ సెంచరీ వృథా..
ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ జట్టు 100 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్ (200 బంతుల్లో 103; 9 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చేలరేగగా.. దేవదత్ పడిక్కల్ (199 బంతుల్లో 88;6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారత్ ‘ఎ’ 226/2తో పటిష్ట స్థితిలో కనిపించింది.
కానీ ఆ తర్వాత లోయార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆసీస్ ముందు భారత్ భారీ స్కోర్ ఉంచలేకపోయింది. అంతకుముందు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ కాగా... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 195 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు నవంబర్ 7 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్‌సీబీతోనే!
Comments
Please login to add a commentAdd a comment