Photo Credit: Twitter
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపియన్ సైనా నెహ్వాల్ త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనుంది. సైనా రాజకీయ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానప్పటికీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు సైనా నెహ్వాల్ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఇన్నాళ్లు ఒక క్రీడాకారిణిగా దేశానికి సేవ చేశానని, ఇకపై రాజకీయ నాయకురాలిగా బీజేపీ తరఫున దేశాభివృద్ధికి దోహదపడాలని భావిస్తున్నట్లు సైనా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక సైనా నెహ్వాల్ 2020లో బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే. కానీ ఎప్పుడు రావాలనే దానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా దేశానికి ఎన్నో ఏళ్లు ప్రాతినిధ్యం వహించాను. ఒలింపిక్స్‌లో పతకం కూడా అందించాను.
ఇక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం. ఆ పార్టీ దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న కృషి నాకు బాగా నచ్చింది. అందుకే బీజేపీలో చేరాను. ఇప్పుడు బీజేపీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి రాజకీయ నేతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. బీజేపీలో కొనసాగుతూ దేశానికి సేవ చేయడం కోసం ఎదురుచూస్తున్నా. మనందరం ఐక్యంగా ఉంటేనే దేశాభివృద్ధి కోసం మరింత మెరుగ్గా పనిచేయగలం’’ అని సైనా చెప్పుకొచ్చింది.
కాగా ఇటీవల ముగిసిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ 2026లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు కాంస్యం అందించిన ట్రిసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీపై సైనా నెహ్వాల్ ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న ట్రిసా-గాయత్రి జోడీ బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌లో ఓటమిపాలై కాంస్యం దక్కించుకున్నారు. 2011లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప జంట బీడబ్ల్యూఎఫ్‌లో పతకం సాధించగా, తాజాగా 15 ఏళ్ల నిరీక్షణకు గాయత్రి-ట్రిసా జంట తెరదించుతూ పతకంతో మెరిశారు.
Read: WTC : కీలక మలుపు.. బంగ్లా ఓటమితో భారత్‌కు లక్కీ చాన్స్!


