
శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడిన పేసర్ షోరిఫుల్ ఇస్లాం తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు చోటు దక్కింది. స్వదేశంలో శ్రీలంకతో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్ జట్టు: మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్, ఎబాడోత్ హుస్సేన్, సయ్యద్ ఎన్ ఖజావుర్, సయ్యద్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం