
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(71) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అతడితో పాటు అఫీఫ్ హుస్సేన్(29), షకీబ్ ఆల్ హసన్(23) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, ముజారబానీ తలా రెండు వికెట్లు సాధించగా.. రజా, విలియమ్స్ చెరో వికెట్ సాధించారు. ముఖ్యంగా బంగ్లా ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన నగరవా.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: T20 WC 2022: దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment