బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్‌ | Habibul Bashar As Chief To Steer National Team Through 2027 ODI World Cup, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్‌

Mar 23 2026 9:27 PM | Updated on Mar 24 2026 12:22 PM

Bashar named chairman of BCB's new selection panel

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నలుగురు సభ్యులతో కూడిన నూతన సెలక్షన్ క‌మిటీ ఛైర్మన్‌గా మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్‌ను బీసీబీ నియ‌మించింది. గ‌తంలో బంగ్లా సెల‌క్ష‌న్ క‌మిటీలో కేవ‌లం ముగ్గురు స‌భ్యులు మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు మ‌రొక‌రిని ప్యాన‌ల్‌లోకి బీసీబీ చేర్చింది. ఈ కొత్త క‌మిటీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 వర‌కు త‌మ బాధ్య‌త‌ల్లో కొన‌సాగ‌నుంది.

కాగా 53 ఏళ్ల బాషర్ బంగ్లాదేశ్ క్రికెట్‌లో త‌నంక‌టూ ప్ర‌త్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 3000 ప‌రుగులు దాటిని మొద‌టి బంగ్లాదేశ్ ఆట‌గాడు కూడా ఆయ‌నే కావ‌డం విశేషం. అదేవిధంగా గ‌తంలో పురుషుల, మహిళల జట్లకు సెలక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా అత‌డికి ఉంది.

ఇక ఈ ప్యాన‌ల్‌లో అత‌డితో పాటు మాజీ పేసర్ హసిబుల్ హొస్సేన్, నయీమ్ ఇస్లాం, నదీఫ్ చౌదరి ఉన్నారు. 39 ఏళ్ల నయీమ్ పేరిట‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ త‌ర‌పున అత్య‌ధిక సెంచ‌రీలు(34) సెంచ‌రీలు చేసిన రికార్డు ఉంది. ఈ సీనియ‌ర్ సెల‌క్ష‌న్ ప్యాన‌ల్ బంగ్లాదేశ్ క్రికెట్ విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తుంద‌ని బీసీబీ భావిస్తోంది. బంగ్లా జ‌ట్టు ఇటీవ‌లే పాకిస్తాన్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement