సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన | BCCI Announces India Womens Squad For 5 T20Is Against South Africa, Check Out Names And Other Details Inside | Sakshi
Sakshi News home page

IND vs SA: సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన

Mar 24 2026 10:20 AM | Updated on Mar 24 2026 11:08 AM

BCCI announces India womens squad for 5 T20Is against South Africa

దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ 15 మంది స‌భ్యుల జ‌ట్టుకు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నుంది. అయితే డబ్ల్యూపీఎల్- 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆల్‌రౌండర్ అనుష్క శర్మకు తొలిసారి జాతీయ జ‌ట్టులో చోటు దక్కింది.

అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారతీ ఫుల్మాలిని ప్రోటీస్‌తో సిరీస్‌కూ కొనసాగించారు. అద్భుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్న భారతీకి ఆసీస్ టూర్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. మరోవైపు 22 ఏళ్ల పేసర్ కాశ్వి గౌతమ్‌కు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.

అయితే యువ స్పిన్నర్  వైష్ణవి శర్మ, స్నేహ రాణాలను ఈ సిరీస్‌కు సెలెక్టర్లు పక్కన పెట్టారు. కాగా ఈ సిరీస్ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా జరగనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ప్రోటీస్ గడ్డపై ప్రారంభం కానుంది.

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వి గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అనుష్క శర్మ.

సిరీస్ షెడ్యూల్:
1.ఏప్రిల్ 17: మొదటి టీ20 (డర్బన్)

2.ఏప్రిల్ 19: రెండో టీ20 (డర్బన్)

3.ఏప్రిల్ 22: మూడో టీ20 (జోహన్నెస్‌బర్గ్)

4.ఏప్రిల్ 25: నాలుగో టీ20 (జోహన్నెస్‌బర్గ్)

5.ఏప్రిల్ 27: ఐదో టీ20 (బెనోని)
చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement