ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని బీసీసీఐ దాదాపుగా ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీలకు ఓ గుడ్‌న్యూస్ చెప్పే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను ఐదుకు పెంచాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఛాన్స్ మాత్రమే ఐపీఎల్ జట్లకు ఉంటుంది.
ఎప్పటి నుంచో రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచమని ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ ఏడాది జూలై 31న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ మరోసారి ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి.
అయితే ఈసారి మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్‌కు భారత క్రికెట్ బోర్డు ఒకే చెప్పినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య ఐదు పెంచితే ఆయా ఫ్రాంచైజీలకు ప్రయోజనం చేకూరనుంది. ఐపీఎల్-2025 రిటెన్షన్ రూల్స్‌ను గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా గురువారం(సెప్టెంబర్ 26) ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: BAN vs IND: టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు అదిరిపోయే గుడ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment