చరిత్ర సృష్టించిన కేప్‌ టౌన్‌ టెస్టు.. 134 ఏళ్ల రికార్డు బద్దలు | Cape Town Test breaks 128-year-old South African record as 23 wickets fall on Day 1 | Sakshi
Sakshi News home page

IND vs SA 2nd Test: చరిత్ర సృష్టించిన కేప్‌ టౌన్‌ టెస్టు.. 134 ఏళ్ల రికార్డు బద్దలు

Published Thu, Jan 4 2024 9:23 AM | Last Updated on Thu, Jan 4 2024 9:42 AM

Cape Town Test breaks 128 yearold South African record as 23 wickets fall on Day 1 - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య ప్రారంభమైన రెండో టెస్టు.. తొలి రోజే ఎన్నో మలుపులు తిరిగింది. అభిమానులకు అసలుసిసలైన టెస్టు మజా అందించింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇరు జట్ల ఫాస్ట్‌ బౌలర్లు పండగ చేసుకున్నారు. పేసర్ల దెబ్బకు తొలిరోజే ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి.  ఈ క్రమంలో కేప్‌టౌన్‌ టెస్టు పలు అరుదైన రికార్డులను బద్దులకొట్టింది.

బ్రేక్‌ చేసిన రికార్డులు ఇవే..
►టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్ల పడిన రెండో మ్యాచ్‌గా ఇది నిలిచింది. అంతకుముందు 1890లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజులో 22 వికెట్లు నెలకూలాయి. అయితే తాజా మ్యాచ్‌తో 134 ఏళ్ల రికార్డు బద్దలైంది. కాగా ఈ జాబితాలో 1902లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ అగ్రస్ధానంలో ఉంది. ఈ మ్యాచ్‌ తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి.

►అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో తొలి రోజు అత్యధిక వికెట్లు పడిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. అంతకుముందు రికార్డు పోర్ట్‌ఎలిజిబెత్‌ వేదికగా 1896లో దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్‌ మధ్య జరగిన మ్యాచ్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు 21 వికెట్లు పడ్డాయి. తాజా మ్యాచ్‌తో 122 ఏళ్ల ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు అయింది. 

►ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే రోజు అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో మ్యాచ్‌గా కేప్‌టౌన్‌ టెస్టు నిలిచింది. ఈ జాబితాలో 188లో లార్డ్స్‌ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ అగ్రస్ధానంలో ఉంది. ఈ మ్యాచ్ రెండో  రోజు ఏకంగా 27 వికెట్లు పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement