కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్‌! | Carlos Alcaraz Stunned By Sebastian Korda In Round 3 At Miami Open 2026, Read Story For More Details | Sakshi
Sakshi News home page

కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్‌!

Mar 23 2026 9:31 AM | Updated on Mar 23 2026 12:47 PM

Carlos Alcaraz Stunned By Sebastian Korda in Round 3 Miami Open

మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సంచ‌ల‌నం న‌మోదయ్యింది. పురుషుల ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ కార్లోస్ అల్క‌రాజ్ ప‌రాజ‌యం చ‌విచూశాడు. మియామి ఓపెన్‌లో భాగంగా ప్ర‌పంచ 36వ ర్యాంక‌ర్ సెబాస్టియ‌న్ కోర్డా చేతిలో అల్క‌రాజ్ ఓట‌మి పాల‌య్యాడు. భార‌త కాలమాన ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్ మ్యాచ్‌లో అల్క‌రాజ్ 3-6, 7-5, 4-6తో సెబాస్టియ‌న్ చేతిలో ఓట‌మి చ‌విచూశాడు. 

రెండు గంట‌ల‌కు పైగా స ఆగిన మ్యాచ్‌లో కోర్డా తొలి సెట్ నుంచే త‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించాడు. తొలి సెట్‌ను 6-3తో సునాయాసంగా నెగ్గిన కోర్డా రెండో సెట్‌ను అల్క‌రాజ్‌కు కోల్పోయాడు. అయితే నిర్ణ‌యాత్మ‌క మూడో సెట్‌లో ఫుంజుకున్న సెబాస్టియ‌న్ కోర్డా ప‌దునైన స‌ర్వీస్‌ల‌తో అల్క‌రాజ్‌ను మ‌ట్టిక‌రిపించి త‌న కెరీర్‌లో అతిపెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు. 

కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన అల్క‌రాజ్ త‌న కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్నాడు. మియామి ఓపెన్ కంటే ముందు జ‌రిగిన ఇండియ‌న్ వెల్స్ టోర్నీలో మంచి ఆరంభంతోనే మొదలుపెట్టిన అల్క‌రాజ్ సెమీస్‌లో వెనుదిరిగాడు.  డానిల్ మెద్వెదెవ్ చేతిలో అల్క‌రాజ్ ఓట‌మిపాల‌య్యాడు. ఈ ఓట‌మితో అల్క‌రాజ్ వ‌రుస 17 విజ‌యాల‌కు బ్రేక్ ప‌డిన‌ట్ల‌యింది. 

తాజాగా మియామి ఓపెన్‌లో ఓట‌మితో అల్క‌రాజ్ ఆధిక్యం 17-2కు త‌గ్గిన‌ట్ల‌యింది. 2022లో మియామి ఓపెన్ నెగ్గిన అల్క‌రాజ్ మ‌రోసారి టైటిల్ నెగ్గాల‌ని ఆశించిన‌ప్ప‌టికీ మూడో రౌండ్‌కు ప‌రిమిత‌మయ్యాడు.  ఇక సెబాస్టియ‌న్ కోర్డా ప్రిక్వార్ట‌ర్స్‌లో క‌చ‌నోవ్ లేదా మార్టిన్ ల్యాండ్‌లూస్‌ల్లో ఒక‌రితో పోటీ ప‌డ‌నున్నాడు.

చదవండి: పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!

Advertisement
 
Advertisement
Advertisement