
గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్ పేస్‌పై గృహ హింస కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రియా పిళ్లై తన భాగస్వామి అయిన లియాండర్ పేస్ ఇంటిని విడిచి వెళ్లాలి అనుకుంటే. .తనకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని, అలాగే అద్దె కోసం మరో రూ.50వేలు ప్రతినెలా అందించాలని పేస్‌ను కోర్టు ఆదేశించింది.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా తాము ఇద్దరం లివ్‌ఇన్ రిలేషన్‌లో ఉన్నామని.. పలు సార్లు పేస్ గృహ హింసకు పాల్పడ్డాడని రియా పిళ్లై ఆరోపించింది. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని కోరుతూ రియా పిళ్లై 2014లో కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై తీర్పును కోర్టు వెల్లడించింది.
చదవండి: ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను'
Comments
Please login to add a commentAdd a comment