వన్డే ప్రపంచకప్-2023లో డీఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) ట్రాకింగ్ నిర్ణయాలు వివాదస్పదమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔట్‌పై కూడా వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్‌లో 2 ఓవర్ వేసిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక ఓవర్‌లో రెండో బంతిని వార్నర్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి వార్నర్ ప్యాడ్‌లకు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీలు చేశాడు. కానీ అంపైర్ చాలా లేటుగా రియాక్ట్ అయ్యి ఔట్ అని వేలు పైకెత్తాడు. వెంటనే వార్నర్ రివ్యూ తీసుకున్నాడు. అయితే రివ్యూలో బంతి తొలుత లెగ్‌సైడ్ వెళ్తున్నట్టు కన్పించినప్పటికీ లెగ్ స్టంప్ టాప్‌లో తాకినట్లు తేలింది.
దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఇది చూసిన వార్నర్ కోపంతో ఊగిపోయాడు. తాజగా ఇదే విషయంపై వార్నర్ స్పందించాడు. ట్రాకింగ్ సరైన దిశలో చూపించలేదని వార్నర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. డీఆర్‌ఎస్ సమీక్షలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందని వార్నర్ అభిప్రాయపడ్డాడు.
"హాక్-ఐ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మాకు ఇప్పటివరకు ఎవరూ వివరించలేదు. ఇదంతా కేవలం టీవీల కోసమే అని అనుకుంటున్నాము. ఆటగాళ్ల వద్దకు వచ్చి హాక్-ఐ టెక్నాలజీ సాంకేతికేత ఎలా పనిచేస్తుందో ఎవరైనా వివరించే చెబితే.. ఆ తర్వాతి మ్యాచ్‌లో రివ్యూ తీసుకోవాలా వద్ద అన్నది నిర్ణయించకుంటాం. ఔట్‌గా ప్రకటించిన వెంటనే ఎలా ఈ నిర్ణయం తీసుకున్నారని ఫీల్డ్ అంపైర్ జోయెల్ విల్సన్‌ను అడిగాను.
అతడు అందుకు బదులుగా బంతి స్వింగ్ అయ్యి స్టంప్స్‌ను తాకుతున్నట్లు భావించి ఔట్ ఇచ్చినట్లు చెప్పాడు. అయితే నా వరకు అయితే బంతి లెగ్‌సైడ్ వెళ్లున్నట్లు అన్పించింది. ఎందుకంటే నేను లెగ్ సైడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాను. రిప్లే చూస్తే కూడా అలాగే అనిపించినా.. థర్డ్ అంపైర్ నిర్ణయం మాత్రం ఫీల్డ్ అంపైర్‌కు అనుకూలంగా వచ్చింది. ఆస్ట్రేలియాలో కంటే బాల్-ట్రాకింగ్ నిర్ణయాలు చాలా ఆలస్యమవుతున్నాయి అని క్రికెట్ ఆస్ట్రేలియా. కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: టీమిండియాను ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తా: పాక్ నటి
Comments
Please login to add a commentAdd a comment