భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) హోదాతో సత్కరించింది. భారత క్రికెట్ జట్టు తరపున గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తుండంతో దీప్తీకు గౌరవం లభించింది.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతిల మీదగా దీప్తి తన నియామక పత్రాన్ని అందుకుంది. అదే విధంగా దీప్తికి డీఎస్పీ పోస్ట్‌తో పాటు రూ.3 కోట్ల రూపాయల నగదు బహుమతిని కూడా యూపీ ప్రభుత్వం అందజేసింది.
ఇక డీఎస్పీ హోదాతో తనను సత్కరించినందుకు శర్మ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. యూపీతో పాటు భారత దేశ వ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఇండియా టూడేతో శర్మ పేర్కొంది.
మరోవైపు పారా ఏషియన్ గేమ్స్‌లో భాగమైన అథ్లెట్లు జతిన్ కుష్వాహా, యశ్ కుమార్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు క్యాష్ ఫ్రైజ్‌ను యోగి అందజేశారు. అదే విధంగా నేషనల్ గేమ్స్‌లో పతకాలు సాధించిన స్నూకర్ ఛాంపియన్ పరాస్ గుప్తా, రైఫిల్ షూటర్ ఆయుషి గుప్తాలకు కూడా రూ. 5 లక్షల నగదు బహుమతి లభించింది.
చదవండి: Ind vs Eng: రోహిత్ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్ అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment