
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె మంచి డ్యాన్సర్ కూడా. ధనశ్రీ ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ వీడియాలు, ఇన్‌స్టా రీల్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది.
తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హాలీవుడ్ కొత్త మూవీ 'బార్బీ' చూడటానికి ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్స్‌ను ధరించింది. ఈ ప్రత్యేక దుస్తుల్లో ఆమె మెరిసిపోయింది. ధనుశ్రీ కొత్త లూక్‌కు సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ధనుశ్రీ పోస్టుపై చాహల్ కూడా స్పందించాడు. హార్ట్, ముద్దు ఎమోజీలను చాహల్ రిప్లేగా ఇచ్చాడు. కాగా చాహల్ ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్నాడు. విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల్లో చాహల్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు.
చదవండి: Virat Kohli: కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ క్రికెటర్ తల్లి.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment