దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 సీజన్ కోసం యూఏఈకి వెళ్లి ముందుగా ప్రాక్టీస్ ఆరంభించాలని భావించిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) అందరి కంటే చివరిగా ప్రాక్టీస్‌కు వెళ్లింది. ఇందుకు కారణం సీఎస్‌కేను కరోనా కలవర పెట్టడమే. ఇందులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 11 మంది సీఎస్‌కే సిబ్బంది ఉన్నారు. దాంతో సీఎస్‌కే ప్రాక్టీస్ ఆలస్యమైంది. కాగా, శుక‍్రవారం ప్రాక్టీస్ చేసిన సీఎస్‌కే.. దాన్ని ముమ్మరం చేసింది. ప్రాక్టీస్ ఆలస్యం కావడంతో సీఎస్‌కే ఎక్కువగా శ్రమిస్తోంది. దీనికి సంబంధించిన ఒక నైట్ ప్రాక్టీస్ సెషన్‌ను సీఎస్‌కే తన ట్వీటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. దీనికి నెట్. సెట్. గో అనే క్యాప్షన్ ఇచ్చిన సీఎస్‌కే.. స్టార్ట్‌ద విజిల్స్, విజిల్ పోడులను ట్యాగ్ చేసింది.
ప్రధానంగా కెమెరాలన్నీ కెప్టెన్ ధోని మీద ఫోకస్ చేశాయి. ఎంఎస్ ధోని, వాట్సన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఆటగాళ్లతో మమేకమై ప్రాక్టీస్‌లో భాగమయ్యాడు.ఐపీఎల్–2020 నుంచి సీనియర్ ఆఫ్‌స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ టోర్నీకి దూరమవున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ఇక స్టార్ ఆటగాడు సురేశ్ రైనా జట్టుకు అందుబాటులో లేడు. ఐపీఎల్‌కు యూఏఈ వెళ్లినా కొన్ని కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. అయితే సీఎస్‌కేతో రైనా జట్టుతో కలుస్తాడా.. లేదా అనేది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది.
Net. Set. Go! 🦁💛 #StartTheWhistles #Yellove #WhistlePodu pic.twitter.com/GD13SGs3x9
— Chennai Super Kings (@ChennaiIPL) September 7, 2020
Comments
Please login to add a commentAdd a comment