శ్రీలంక వెటరన్ ఓపెనర్ దిముత్ కరుణరత్నే అరుదైన క్లబ్‌లో చేరాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది పరుగులు చేసిన అతను.. టెస్ట్‌ల్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కరుణరత్నేకు ముందు సంగక్కర (12400), జయవర్దనే (11814), ఏంజెలో మాథ్యూస్ (7766) టెస్ట్‌ల్లో శ్రీలంక తరఫున ఏడు వేల మార్కును దాటారు. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణరత్నే 57వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (15921) అగ్రస్థానంలో ఉన్నాడు.
బ్రాడ్‌మన్‌ను అధిగమించిన కరుణరత్నే
తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగులు చేసిన కరుణరత్నే దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్ 6996 పరుగులు చేశాడు. ప్రస్తుతం కరుణరత్నే ఖాతాలో 7007 పరుగులు ఉన్నాయి.
కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.
నిస్సంక సూపర్ సెంచరీ
219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325, ఓలీ పోప్ 154, బెన్ డకెట్ 86, మిలన్ రత్నాయకే 3/56
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 263, నిసాంక 64, ధనంజయ డిసిల్వ 69, కమిందు మెండిస్ 64, ఓల్లీ స్టోన్ 3/35
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 156, జేమీ స్మిత్ 67, లహీరు కుమార 4/21
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 219/2, నిసాంక 127 నాటౌట్, అట్కిన్సన్ 1/44
Comments
Please login to add a commentAdd a comment