టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన | England Announce Playing XI for 3rd T20I vs IND No Rest for Archer | Sakshi
Sakshi News home page

టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన

Jul 6 2026 6:16 PM | Updated on Jul 6 2026 6:23 PM

England Announce Playing XI for 3rd T20I vs IND No Rest for Archer

టీమిండియాతో మూడో టీ20 మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. రెండో మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్‌ ఎలెవన్‌నే కొనసాగిస్తామని తెలిపింది. కాగా సొంతగడ్డపై భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం అందుకున్న సంగతి తెలిసిందే.

ఇరుజట్ల మధ్య చెస్టర్‌ లీ వేదికగా జరిగిన మ్యాచ్‌ ఫలితం తేలకుండానే వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో మాంచెస్టర్‌ వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఆతిథ్య ఇంగ్లండ్‌ అదరగొట్టింది. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ముందంజ వేసింది.

టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ భారత్‌ను 190 పరుగులకు కట్టడి చేయగలిగింది. సామ్‌ కర్రాన్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జోఫ్రా ఆర్చర్‌, లియామ్‌ డాసన్‌, విల్‌ జాక్స్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పనిపూర్తి చేసింది.

ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌, జోస్ బట్లర్‌ డకౌట్‌ అయినా.. హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్‌ (15 బంతుల్లో 39) ఆడి జట్టును ఆదుకున్నాడు. జేకబ్‌ బెతెల్‌ ధనాధన్‌ దంచికొట్టి (46 బంతుల్లో 76 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు. టామ్‌ బాంటన్‌ (39) కూడా రాణించాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో గెలిపించిన తుదిజట్టునే ఇంగ్లండ్‌ మూడో మ్యాచ్‌కూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

టీమిండియాతో మూడో టీ20కి భారత తుదిజట్టు
ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, జోష్‌ టంగ్‌.
బెంచ్‌: రెహాన్‌ అహ్మద్‌, సాకిబ్‌ మహమూద్‌, సోనీ బేకర్‌, జేమ్స్‌ కోల్స్‌, జోర్డాన్‌ కాక్స్‌, ల్యూక్‌ వుడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement