వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసింది. ఇక ఇరు జట్లు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుపై కన్నేశాయి. ఈ మ్యాచ్ కోసం తమ ఆస్రాలను, వ్యూహాలను సిద్దం చేసుకునే పనిలో ఇరు జట్లు పడ్డాయి.
దుబాయ్ వెళ్లనున్న ఇంగ్లండ్ టీమ్..
అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల గ్యాప్ రావడంతో ఇంగ్లండ్ దుబాయ్ వెళ్లనుంది. అక్కడ ఇంగ్లీష్ జట్టు విశ్రాంతి తీసుకోనుంది. ఆ జట్టు కుటంబసభ్యులు కూడా దుబాయ్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మూడో టెస్టు కోసం కూడా ఇంగ్లండ్ అక్కడ ప్రాక్టీస్ చేయనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఇంగ్లండ్ ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు మళ్లీ అదే స్టేడియంలో రాజ్‌కోట్ టెస్టు కోసం తీవ్రంగా శ్రమించనుంది. ముఖ్యంగా అక్కడ స్పిన్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు గోల్ఫ్ కూడా ఆడే అవకాశముంది. తిరిగి మళ్లీ ఫిబ్రవరి 13న ఇంగ్లండ్ టీమ్ నేరుగా రాజ్‌కోట్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.
చదవండి: SA T20 2024: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌కు ఊహించని షాక్.. గన్‌తో బెదిరించి! ఏకంగా
Comments
Please login to add a commentAdd a comment