లండన్: రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. బ్రిటన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరడంతో ఇప్పటికే వీకెండ్ మ్యాచ్‌లను వాయిదా వేశారు. మరోవైపు ఆటగాళ్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహకులకు తలనొప్పిగా మారింది. రెండు డోసుల వ్యాక్సిన్, అలాగే బూస్టర్ డోస్ వేయించుకునేందుకు ఆటగాళ్లు ససేమిరా అంటున్నట్లు నిర్వహకులు తెలిపారు.
లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లలో కేవలం 68 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ డబుల్ డోస్ వేయించుకున్నారని, ఇంత తక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ జరగడం వల్లే భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని నిర్వహకులు వాపోతున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ఆటగాళ్లపై ఒత్తిడి చేయడం లీగ్ నిబంధనలకు విరుద్ధం కావడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నట్లు పేర్కొన్నారు.
అయితే, వ్యాక్సిన్ నిరాకరణకు ఆటగాళ్లు చెబుతున్న కారణాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయని వారంటున్నారు. మెజారిటి శాతం వ్యాక్సిన్‌పై నమ్మకం లేదని చెబుతుండగా, శాకాహారులకు టీకా అవసరం లేదని కొందరు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మరికొందరు వ్యాక్సిన్‌ను నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు పుట్టరనే భయంతో కొందరు ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవట్లేదని, ఈ నిరాధారమైన అపోహని వారు గుడ్డిగా నమ్ముతున్నారని లీగ్ నిర్వహకులు తెలిపారు.
చదవండి: ధోని ఈజ్ బెస్ట్, తర్వాత ఆ ఇద్దరు.. అశ్విన్ లిస్ట్‌లో పంత్‌కి దక్కని చోటు
Comments
Please login to add a commentAdd a comment