హాకీ ఇండియా లీగ్ నిర్వాహకుల నిర్ణయం
న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులను ఉచితంగా అనుమతించాలని లీగ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఆటను అభిమానులకు చేరువ చేసేందుకు ఇది సరైన మార్గం అని హెచ్‌ఐఎల్ గవర్నింగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. డిసెంబర్ 28 నుంచి రూర్కేలాలోని బిర్సా ముండా స్టేడియంలో పురుషుల హెచ్‌ఐఎల్ ప్రారంభం కానుంది.
మొత్తం 8 జట్లు పాల్గొననున్న ఈ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. మరోవైపు రాంచీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 26 మధ్య నిర్వహించనున్న మహిళల హెచ్‌ఐఎల్ లీగ్‌లో 4 జట్లు పాల్గొంటున్నాయి.
‘టికెట్ల విక్రయంతో డబ్బు సంపాదించడంకన్నా... ఆటను అభిమానులకు చేరువ చేయడం ముఖ్యం. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసే అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాకీ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘మైదానాల్లోకి ఉచిత ప్రవేశం కల్పించడంతో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా... ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి పోరాటాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంది’ అని హెచ్‌ఐఎల్ గవరి్నంగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment