Dilip Tirkey
-
ప్రేక్షకులకు ప్రవేశం ఉచితం
న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులను ఉచితంగా అనుమతించాలని లీగ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఆటను అభిమానులకు చేరువ చేసేందుకు ఇది సరైన మార్గం అని హెచ్ఐఎల్ గవర్నింగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. డిసెంబర్ 28 నుంచి రూర్కేలాలోని బిర్సా ముండా స్టేడియంలో పురుషుల హెచ్ఐఎల్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొననున్న ఈ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. మరోవైపు రాంచీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 26 మధ్య నిర్వహించనున్న మహిళల హెచ్ఐఎల్ లీగ్‌లో 4 జట్లు పాల్గొంటున్నాయి. ‘టికెట్ల విక్రయంతో డబ్బు సంపాదించడంకన్నా... ఆటను అభిమానులకు చేరువ చేయడం ముఖ్యం. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసే అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాకీ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.‘మైదానాల్లోకి ఉచిత ప్రవేశం కల్పించడంతో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా... ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి పోరాటాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంది’ అని హెచ్ఐఎల్ గవరి్నంగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ అన్నాడు. -
కొత్త హంగులతో పునరాగమనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 2017లో నిలిచిపోయిన హెచ్‌ఐఎల్‌ను తిరిగి ఆరంభించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. ఈసారి లీగ్‌కు సరికొత్త హంగులు అద్దగా... పురుషులతో పాటు మహిళల విభాగంలో పోటీలుజరగనున్నాయి. డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు ప్లేయర్ల వేలం జరగనుంది. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. ఇందులో నలుగురు జూనియర్ ఆటగాళ్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టును రెసల్యూట్ స్పోర్ట్స్ కంపెనీ సొంతం చేసుకుంది. మహిళల లీగ్ తుదిపోరు వచ్చే ఏడాది జనగరి 26న, పురుషుల ఫైనల్ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించాడు. ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న లీగ్ విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగం దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఏడేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభం కానుంది. 2013లో ప్రారంభమైన లీగ్ ఐదు సీజన్లు పాటు విజయవంతంగా కొనసాగిన తర్వాత 2017లో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ శుక్రవారం వెల్లడించాడు. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఈ సారి మహిళల విభాగంలోనూ మ్యాచ్‌లు జరగనున్నాయి. హెచ్ఐఎల్ తిరిగి ప్రారంభమవడం ద్వారా ఆటకు మరింత ఆదరణ దక్కడంతో పాటు... మహిళల హాకీలో కోత్త జోష్ రానుంది. భారత మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీ హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఇప్పటికి కార్యరూపం దాలి్చంది. హెచ్ఐఎల్కు టిర్కీనే చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. ‘జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడంలో హాకి ఇండియా లీగ్ కీలక పాత్ర పోషించనుంది. హాకీ క్రీడలో కొత్త అధ్యాయానికి నేడు తెర లేచినట్లు అనిపిస్తోంది. అడగ్గానే హెచ్ఐఎల్ కోసం 35 రోజుల సమయాన్ని కేటాయించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు ధన్యవాదాలు. హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీని కోసం కృషి చేశా. ఇప్పటికి కల సాకారమైంది’ అని టీర్కీ పేర్కొన్నాడు. హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ మాట్లాడుతూ... భారత్‌లో హాకీ కేవలం క్రీడ మాత్రమే కాదని దీనికి భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. 2036 వరకు భారత హాకీకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించనుందని పునరుద్ఘాటించారు. జట్ల వివరాలు పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. వాటిలో చెన్నై జట్టుకు చార్లెస్ గ్రూప్, లక్నో జట్టుకు యదు స్పోర్ట్స్, పంజాబ్ జట్టుకు జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ జట్టుకు ష్రాచీ స్పోర్ట్స్, హైదరాబాద్ జట్టుకు రెసల్యూట్ స్పోర్ట్స్, రాంచీ జట్టుకు నవోయమ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులుగా కొనసాగనున్నారు. టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతికి చెందిన ఎస్జీ స్పోర్ట్స్ కంపెనీ ఢిల్లీ జట్టును సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో హరియాణా జట్టును జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ టీమ్‌ను ష్రాచీ స్పోర్ట్స్, ఢిల్లీ జట్టును ఎస్జీ స్పోర్ట్స్, ఒడిశా జట్టును నవోయమ్ స్పోర్ట్స్ సొంతం చేసుకున్నాయి. మరో రెండు ఫ్రాంచైజీల యజమానులను త్వరలోనే వెల్లడించనున్నారు. » పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో 6 జట్లు లీగ్‌లో పాల్గొననున్నాయి. గతంలో కేవలం పురుషుల విభాగంలోనే పోటీలు జరగగా.. తొలిసారి మహిళా లీగ్‌ను ప్రవేశ పెడుతున్నారు. » పురుషుల విభాగంలో పోటీలను రౌర్కెలాలో, మహిళల మ్యాచ్‌లను రాంచీలో నిర్వహించనున్నారు. » ఒక్కో జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వారిలో 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్ ప్లేయర్లు తప్పనిసరి. » డిసెంబర్ 28న ఈ లీగ్ ప్రారంభం కానుండగా... మహిళల విభాగంలో వచ్చే ఏడాది జనవరి 26న రాంచీలో ఫైనల్ జరగనుంది. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రౌర్కెలాలో తుదిపోరు జరగనుంది. » ఈనెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ప్లేయర్ల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ప్లేయర్ల కనీస ధరను మూడు కేటగిరీలుగా (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) విభజించారు. » ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 4 కోట్లు... మహిళల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు ఖర్చు చేయవచ్చు. » 2013లో తొలిసారి నిర్వహించిన హెచ్ఐఎల్లో రాంచీ రైనోస్ టైటిల్ సాధించగా.. ఆ తర్వాత 2014లో ఢిల్లీ వేవ్‌రైడర్స్, 2015లో రాంచీ రాయ్స్, 2016లో పంజాబ్ వారియర్స్, 2017లో కళింగ లాన్సర్స్ చాంపియన్‌గా నిలిచాయి. » పారిస్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఆటకు గుడ్‌బై చెప్పిన భారత దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఢిల్లీ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. -
ఏడేళ్ల విరామం తర్వాత...
న్యూఢిల్లీ: ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానుల మందుకు రానుంది. 2013లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హెచ్ఐఎల్ ఐదు సీజన్ల తర్వాత 2017లో నిలిచిపోయింది. హకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఎట్టకేలకు శుక్రవారం దీనికి ఆమోద ముద్ర లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 28న ప్రారంభం కానున్న ఈ లీగ్ సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఇప్పుడు మహిళల విభాగంలోనూ నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో 8 జట్లు (చెన్నై, లక్నో, పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, రాంచీ, హైదరాబాద్)... మహిళల విభాగంలో 6 జట్లు (పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, మరో 2 జట్లను ప్రకటించాలి) పోటీపడతాయి. పురుషుల మ్యాచ్‌లను రౌర్కెలాలో, మహిళల పోటీలను రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల లీగ్ ఫైనల్ వచ్చే ఏడాది జనవరి 26న, పురుషుల తుదిపోరు ఫిబ్రవరి 1న జరగనుంది. లీగ్ కోసం ఈ నెల 13 నుంచి 15 వరకు ప్లేయర్ల వేలం జరగనుంది. మూడు కేటగిరీల్లో (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) ప్లేయర్లను విభజించారు. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. అందులో కనీసం 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ లీగ్‌తో దేశంలో మహిళల హాకీకి మరింత ఆదరణ దక్కుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2017లో చివరిసారి జరిగిన హాకీ ఇండియా లీగ్‌లో కళింగ లాన్సర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఫుల్టన్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్‌ను నియమిస్తున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించారు. 48 ఏళ్ల ఫుల్టన్ దక్షిణాఫ్రికా తరఫున 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రీడాకారుడిగా రిటైరయ్యాక కోచింగ్‌వైపు మళ్లిన ఫుల్టన్ 2014 నుంచి 2018 వరకు ఐర్లాండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఫుల్టన్ శిక్షణలో ఐర్లాండ్ వందేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2015లో ఆయన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫుల్టన్ బెల్జియం జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పని చేశాడు. శిక్షణ బృందంలో ఫుల్టన్ సభ్యుడిగా ఉన్నపుడు బెల్జియం 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించింది. గత జనవరిలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియా నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ..
హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన రాకేష్ కాత్యాల్, బోలా నాథ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా టిర్కీ గెలుపొందాడు. కాగా హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఎంపిక ఏకగ్రీవం కావడంతో వారం రోజుల ముందే నిర్వహకులు ప్రకటించారు. అయితే జాతీయ క్రీడా నియమావళిని హాకీ ఇండియా ఉల్లంఘించిందే అని చెప్పుకోవాలి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం.. ఎన్నికల తేదికు ముందు విజేతను ప్రకటించకూడదు. కాగా హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు నిర్వాహకుల కమిటీ సభ్యలకు టిర్కీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా 44 ఏళ్ల టిర్కీ 1998 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అదే విధంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీగా భోలా నాథ్ సింగ్, కోశాధికారిగా శేఖర్ జె. మనోహరన్ ఎంపికయ్యారు. చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
'మన దిగ్గజ ఆటగాళ్లను గుర్తించడం లేదు'
న్యూఢిల్లీ:కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన భారత హాకీ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ షాహిద్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని రాజ్యసభ వేదికగా పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన షాహిద్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే సాయాన్ని అందించి ఆదుకోవాలన్నారు. గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో మాజీ హాకీ ఆటగాడు, ఎంపీ దిలీప్ టిర్కే(బీజేడీ) ఈ అంశాన్ని లేవనెత్తగా దానికి పలువురు ఎంపీలు మద్దతు తెలిపారు. 'చాలామంది ప్రస్తుత భారత హాకీ ఆణిముత్యాలకు షాహిద్ ఒక రోల్ మోడల్. అతని సేవల్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. మనం చాలా మంది క్రీడా దిగ్గజాల్ని పట్టించుకోవడం లేదు. ఒక క్రికెట్ కే గుర్తింపు ఇచ్చి.. మిగతా క్రీడా దిగ్గజాలను పక్కకు పెడుతున్నాం. షాహిద్ మరణం వారి కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది కల్గించకూడదు. అలా జరగాలంటే ప్రభుత్వం తక్షణమే వారికి సాయం చేయాలి' అని దిలీప్ విన్నవించారు. అటు ప్రతిపక్ష ఎంపీలతో పాటు ప్రభుత్వ ఎంపీలు కూడా టిర్కే అభిప్రాయంతో ఏకీభవించారు.