Fans Slam Mitchell McClenaghan After His Tweet on India's Series Win - Sakshi
Sakshi News home page

Mitchell McClenaghan: ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడలేదు! నువ్వు విమర్శిస్తావా..

Published Fri, Dec 10 2021 12:01 PM | Last Updated on Fri, Dec 10 2021 6:01 PM

Fans Troll Mitchell McClenaghan After Tweet India Test Series Win Vs NZ - Sakshi

Fans Troll Mitchell McClenaghan.. టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఇటీవలే ముగిసింది. ఈ సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది. వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో కివీస్‌పై విజయం సాధించి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంది. టీమిండియా ప్రదర్శనపై అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన సమయంలో ఒక న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మాత్రం విమర్శించాడు.

చదవండి: రోహిత్‌ శర్మ అసంతృప్తి! కట్‌చేస్తే..

కివీస్‌ పేసర్‌ మిచెల్‌ మెక్లీన్‌గన్‌ చేసిన ఒక ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఉన్న న్యూజిలాండ్‌ను టీమిండియా తమ సొంతగడ్డపై ఓడించడం పెద్ద విశేషం కాదు. వాళ్లకనుగుణంగా పిచ్‌ను తయారు చేసుకొని గెలిచారు. మొత్తానికి గెలిచినందుకు టీమిండియాకు కంగ్రాట్స్‌'' అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. నిజానికి మెక్‌క్లీన్‌గన్‌ న్యూజిలాండ్‌ తరపున ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేదు. కేవలం వన్డేలు, టెస్టులకు మాత్రమే పరిమితమైన ఈ కివీస్‌ పేసర్‌ 48 వన్డేలు.. 29 టి20లు ఆడాడు.  దీంతో మెక్‌క్లీన్‌గన్‌ ట్వీట్‌ను ఫ్యాన్స్‌ తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు.

''న్యూజిలాండ్‌కు ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడేలేదు.. నువ్వు విమర్శిస్తావా''.. '' ప్రతీ జట్టు తమ సొంతగడ్డపై బెబ్బులిలానే కనిపిస్తుంది.. ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ ఇలా ఏవైనా ఒకే తీరు ఆటను చూపిస్తాయి.. కనీసం ఇది కూడా తెలియదా''.. '' టెస్టు చాంపియన్‌ను టీమిండియా ఓడించిందని ఒక న్యూజిలాండ్‌ ఆటగాడు ఏడుస్తున్నాడు. ఒకవేళ మా ఇండియా న్యూజిలాండ్‌లో​ పర్యటించి ఓడినప్పటికి.. మేం పెద్దగా బాధపడం.. మిగతా దేశాల్లో గెలిచి మా ప్రతిష్టను పెంచుకుంటాం''..'' నిజాయితీ ఆటకు మారుపేరు బ్లాక్‌క్యాప్స్‌.. దానిని మెక్‌క్లీన్‌గన్‌ చెడగొట్టాడు'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: ఐపీఎల్‌పై మనసులో మాటను బయటపెట్టిన కివీస్‌ సంచలన స్పిన్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement