Former Gujarat First Class Cricketer Jaswant Bakrania Died In Bengaluru- Sakshi
Sakshi News home page

Jaswant Bakrania Death: గుజరాత్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కన్ను మూత..

Published Tue, Sep 13 2022 7:02 PM | Last Updated on Tue, Sep 13 2022 7:19 PM

Former Gujarat First Class cricketer Jaswant Bakrania passes away - Sakshi

సౌరాష్ట్ర, గుజరాత్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జస్వంత్ బక్రానియా(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడాదృవీకరించింది.

'జస్వంత్‌ భాయ్‌ మృతి పట్ల సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము" అని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొం‍ది.

1970 నుంచి 1983 మధ్య బక్రానియా సౌరాష్ట్ర, గుజరాత్‌ తరపున 56 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అతని కెరీర్‌లో 3137 పరుగులతో పాటు ఐదు సెంచరీలు కూడా సాధించారు. అదే విధంగా కూడా 51 క్యాచ్‌లు, 12 స్టంఫౌట్‌లు కూడా తన కెరీర్‌లో ఉన్నాయి.
చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement