
రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ సింగ్ గహ్లోత్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రాహుల్ 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 157 బంతులు ఎదుర్కొన్న రాహుల్ సింగ్.. 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్ సింగ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1985లో వాంఖడేలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో బాంబే (ప్రస్తుతం ముంబై) తరఫున 123 బంతుల్లో శాస్త్రి తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 76.4 ఓవర్లలో 5 వికెట్లకు 474 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేశాడు.
చదవండి: #David Warner: ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?
Comments
Please login to add a commentAdd a comment