
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగనున్నాడు. ఈ మేరకు బుధవారం దుబాయ్ బయల్దేరి వెళ్లిన గంగూలీ... ఈ విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లేందుకు ఆరు నెలల తర్వాత తొలిసారిగా విమానమెక్కాను. క్రేజీ జీవితం మారిపోతూ ఉంటుంది’ అని గంగూలీ రాసుకొచ్చాడు. ప్రయాణ నిబంధనల ప్రకారం మాస్క్‌తో పాటు ఫేస్ షీల్డ్‌ను దాదా ధరించాడు. ఇప్పటికే ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అక్కడే ఉండి బయో బబుల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. (చదవండి: మనీశ్ పాండే ఎంతో కీలకం)
Comments
Please login to add a commentAdd a comment