
జపాన్‌పై భారత్ ఘన విజయం
సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నీ
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ హాకీ టోర్నమెంట్‌లో యువ భారత జట్టు శుభారంభం చేసింది. మలేసియాలో జరుగుతున్న ఈ టోరీ్నలో శనివారం భారత్ 4–2తో జపాన్‌ను చిత్తు చేసింది. హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్ జాతీయ జూనియర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆడిన తొలి మ్యాచ్‌లో యంగ్ ఇండియా అదరగొట్టింది. భారత్ తరఫున అమీర్ అలీ (12వ నిమిషంలో), గుర్‌జోత్ సింగ్ (36వ నిమిషంలో), ఆనంద్ సౌరభ్ (44వ నిమిషంలో), అంకిత్ పాల్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
జపాన్ తరఫున సుబాస తనాకా (26వ ని.లో), రకుసై యమనకా (57వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు అటాకింగ్ గేమ్ కొనసాగించింది. ఒలింపిక్స్‌లో భారత జట్టు రెండు కాంస్య పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించి... పారిస్ విశ్వక్రీడల తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికిన గోల్ కీపర్ శ్రీజేశ్ మార్గనిర్దేశనంలో కుర్రాళ్లు సత్తా చాటారు. తొలి క్వార్టర్‌లో జపాన్ రక్షణ వలయాన్ని చేధించుకుంటూ ముందుకు వెళ్లిన అమీర్ అలీ తొలి గోల్ అందించి జట్టుకు ఆధిక్యం అదించాడు.
అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం పట్టు కొనసాగించాలంటే మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఫీల్డ్ గోల్స్ కొట్టాలని పదే పదే చెప్పే శ్రీజేశ్... కోచ్‌గా తొలి మ్యాచ్‌లోనే కుర్రాళ్లతో ఆ పని చేసి చూయించాడు. అయితే కాసేపటికే సుబాస తనాకా గోల్ కొట్టడంతో జపాన్ స్కోరు సమం చేయగలిగింది. మూడో క్వార్టర్‌లో భారత్ రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం కనబర్చగా... చివరి క్వార్టర్‌లో అంకిత్ పాల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి యంగ్ ఇండియా ఆధిక్యం మరింత పెంచగా... మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... జపాన్ ఓ గోల్ చేసింది. నేడు గ్రేట్ బ్రిటన్‌తో భారత జట్టు తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment