
బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి శుభారంభం చేశాడు. లెవాన్ పాంట్‌సులయ (జార్జియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో హర్ష 40 ఎత్తుల్లో గెలిచాడు. గ్రెగరీ కైదనోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, విదిత్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానందలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మహిళల విభాగంలో మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక 27 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment