దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా మరోసారి గాయం బారిన పడ్డాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బావుమా గాయపడ్డాడు. మొదటి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బావుమా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లావిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు.
ఆ తర్వాత అతడిని స్కానింగ్ తరలించారు. ఎడమ తొడ కండరాల్లో నరం పట్టేసినట్లు తేలింది. దీంతో ఈ మ్యాచ్‌తో పాటు రెండో టెస్టుకు అతడు అందుబాటుపై సందేహం నెలకొంది. బావుమా ఫీల్డ్ నుంచి వైదొలగడంతో వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో బావుమాపై ప్రోటీస్ మాజీ ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ విమర్శల వర్షం కురిపించాడు. అతడికి పూర్తి ఫిట్‌నెస్ లేకపోయినప్పటికీ అవకాశాలు ఎలా ఇస్తున్నారని గిబ్స్ మండిపడ్డాడు. అన్‌ఫిట్ ప్లేయరని, అధిక బరువతో బాధపడుతున్నాడని తీవ్ర స్ధాయిలో విరుచుపడ్డాడు.
'2009లో సౌతాఫ్రికా ట్రైనర్‌గా ప్రారంభించి టీమ్ హెడ్ కోచ్‌గా మారిన వ్యక్తి.. అన్‌ఫిట్, అధిక బరువున్న ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి అనుమతించడం హాస్యాస్పదంగా ఉంది.'అని హెర్షల్ గిబ్స్ ట్వీట్ చేశాడు. కాగా ప్రస్తుతం ప్రోటీస్ హెడ్ కోచ్‌గా ఉన్న షుక్రి కాన్రాడ్ గతంలో దక్షిణాఫ్రికా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment