
Udpate: తొలి టెస్టులో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
ఐదో రోజు ఆట ప్రారంభమైంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ టామ్ లాథమ్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.
బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టును వరుణుడు వెంటాడుతునే ఉన్నాడు. వర్షం కారణంగా ఐదో రోజ ఆట ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఐదో రోజు ఆట ఉదయం 9.15 గంటలకు ప్రారంభం కావాలి.
కానీ శనివారం ఆర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా చిన్నస్వామి స్టేడియం ఔట్ ఫీల్డ్ కాస్త చిత్తడిగా మారింది. ప్రస్తుతం అక్కడ వర్షం పడటం లేదు. మైదానాన్ని సిద్దం చేసే పనిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. ఉదయం 10:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే ప్రస్తుతం వర్షం లేకపోయినప్పటకి మళ్లీ 11 గంటల సమయంలో వరుణుడు తిరిగుముఖం పట్టనున్నట్లు ఆక్యూ వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం వరకూ అడపాదడపా వర్షం పడే అవకాశం మున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రత్యర్ధి ముందు భారత్ కేవలం 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఓటమి నుంచి భారత్ తప్పించుకోలేదు.