Siraj- Bavuma: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో భాగంగా ప్రొటీస్ ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యవహరించిన తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటర్‌తో మాట్లాడితే సరిపోతుందని, మరీ దూకుడుగా ప్రవర్తించడం సరికాదన్నాడు. సిరాజ్ పట్ల ప్రొటిస్ ఆటగాడు తెంబా బవుమా హుందాగా ప్రవర్తించిన తీరు ఆదర్శనీయమని కొనియాడాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భాగంగా ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ 61వ ఓవర్ బౌల్ చేశాడు.
ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న బవుమా డిఫెన్స్ ఆడాడు. ఇంతలో బంతిని అందుకున్న సిరాజ్ స్టంప్స్‌ను పడగొట్టే క్రమంలో దూకుడుగా వ్యవహరించాడు. కోపంగా బవుమా వైపు బంతిని విసిరాడు. అది కాస్తా బవుమా పాదానికి గట్టిగా తగలడంతో అతడి నొప్పితో విలవిల్లాడాడు. అనూహ్య పరిణామానికి కంగుతిన్న సిరాజ్ వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సారీ చెప్పాడు. ఇందుకు స్పందించిన బవుమా.. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ పర్వాలేదని చెప్పాడు. ఈ ఘటన గురించి సునిల్ గావస్కర్ మాట్లాడుతూ... ‘‘అక్కడ పరుగు తీసే ప్రయత్నం కనిపించలేదు.
కానీ సిరాజ్ కాస్త దూకుడుగా ముందుకువెళ్లాడు. ఒకవేళ పరుగు తీయాలని ప్రయత్నించినా అలా చేయడం సరికాదు. నిజానికి బ్యాటర్ అక్కడే ఉన్నాడు. తను పరుగు తీయలేదు. అలాంటప్పుడు మరి అలా వ్యవహరించడం దేనికి. సిరాజ్ బవుమాతో మాట్లాడాల్సింది. ఏదేమైనా తెంబా బవుమా సిరాజ్‌తో ప్రవర్తించిన తీరు అమోఘం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి టీమిండియా సెంచూరియన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. బవుమా తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు.
చదవండి: IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... ఇప్పటికే రాయుడు, అశ్విన్...
Comments
Please login to add a commentAdd a comment