క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ సమరానికి రంగం సిద్దమైంది. దాదాపు పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో అదరగొట్టాలని భారత జట్టు భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఫామ్‌ను చూస్తే మరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచే అవకాశం ఉంది.
వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన ఆసియాకప్, ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోనూ టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇక ఆస్ట్రేలియాతో మూడో వన్డే అనంతరం భారత జట్టు వరల్డ్ కప్ ప్రిపేరేషన్స్ గురించి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ప్రపంచకప్‌కు ముందు తమ జట్టు సాధించిన విజయాలపై ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదే జోరును వరల్డ్‌కప్‌లోనూ కొనసాగిస్తామని ఆయన తెలిపాడు.
"మెగా టోర్నీకి ముందు ప్రతీ ఒక్క ప్లేయర్ ఫామ్‌లో ఉండడం చాలా ఆనందగా ఉంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో జస్ప్రీత్ రెండు మ్యాచ్‌లు ఆడాడు. అతడు తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు.
సిరాజ్ కూడా మడమ నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేయగలిగాడు. అశ్విన్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మరోవైపు కేఎల్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ 50 ఓవర్ల పాటు చేశాడు. శ్రేయస్ కూడా సెంచరీతో రాణించాడు. వరల్డ్ కప్‌కు ముందు వారు తమ రిథమ్‌ను తిరిగి పొందడానికి మంచి సమయం దొరికింది. వారికి మంచి ప్రాక్టీస్ కూడా లభించింది. అయితే వరల్డ్ కప్ ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచుల్లో మొత్తం 15 మంది భాగమవుతారు. దీనివల్ల వార్మప్ మ్యాచ్‌లలో ఆటగాళ్లు అంత ఏకగ్రాతతో ఆడలేరని" ద్రవిడ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
అదే విధంగా భారత జట్టులో కొంత మంది సభ్యులు వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం కోలుకున్నారని ద్రవిడ్ తెలిపాడు. వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. సెప్టెంబర్ 30న గువాహతి వేదికగా ఇంగ్లండ్ తో తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు గువాహతికి చేరుకున్నాయి.
చదవండి: అయ్యర్ అదరగొడుతున్నాడు.. సూర్యకు జట్టులో చోటు కష్టమే: గవాస్కర్
Comments
Please login to add a commentAdd a comment