భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. షెడ్యూల్‌, జట్లు.. ఎక్కడ చూడొచ్చంటే? | India Vs South Africa: Check Full Schedule, Squads And Live Streaming Info For The IND Vs SA T20I Series - Sakshi
Sakshi News home page

IND Vs SA T20 Series: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. షెడ్యూల్‌, జట్లు.. ఎక్కడ చూడొచ్చంటే?

Published Thu, Dec 7 2023 4:43 PM | Last Updated on Thu, Dec 7 2023 6:17 PM

India vs South Africa: Check full schedule and squads for the IND vs SA series - Sakshi

సుమారు రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు అడుగుపెట్టింది. ముంబై నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో టీమిండియా సౌతాఫ్రికాకు గురువారం చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. 

డర్బన్‌ వేదికగా డిసెంబర్ 10న జరిగే టీ 20 మ్యాచ్‌తో భారత జట్టు ప్రోటీస్‌ పర్యటన షురూ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ల కోసం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌? టైమింగ్స్‌? వంటి తదితర వివరాలపై ఓ లుకేద్దాం.

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్
టీ20 సిరీస్‌
డిసెంబర్ 10: 1వ T20I- కింగ్స్‌మీడ్, డర్బన్ 
డిసెంబర్ 12: 2వ T20I- సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా
డిసెంబర్ 14: 3వ T20I – న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్

మూడు టీ20లు భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

వన్డే సిరీస్
డిసెంబర్ 17: 1వ ODI – న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్
డిసెంబర్ 19: 2వ ODI – సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా
డిసెంబర్ 21: 3వ ODI- బోలాండ్ పార్క్, పార్ల్

తొలి వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం అవ్వనుండగా.. తదుపరి రెండు మ్యాచ్‌లు సాయంత్రం 4:30 గంటలకు మొదలు కానున్నాయి.

టెస్ట్ సిరీస్
డిసెంబర్ 26-30: 1వ టెస్టు- సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్
జనవరి 3-7: 2వ టెస్ట్- న్యూలాండ్స్, కేప్ టౌన్ 
బాక్సింగ్ డే టెస్టు మధ్యాహ్నం 1:30 గంటలకు, రెండో టెస్టు మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఎక్కడ చూడొచ్చంటే?
భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌ను ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించివచ్చు.  అలాగే డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి.

భారత టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.

దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.

దక్షిణాఫ్రికా వన్డే జట్టు: ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, వాండర్‌ డసెన్, కైల్ వెరిన్నే, లిజాడ్ విలియమ్స్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement