భారత క్రికెట్ కొత్త సీజన్‌కు రంగం సిద్ధం
తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న ఆటగాళ్లు
చెన్నై: సొంతగడ్డపై కొత్త సీజన్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నాహాలు మొదలయ్యాయి. నెల రోజుల విరామం తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా మళ్లీ ఒక్క చోట చేరారు. ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు మొత్తం సాధనలో మునిగింది.
తొలి రోజు శుక్రవారం చిదంబరం స్టేడియంలో భారత జట్టు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌లో పాల్గొంది. గత నెల 7న భారత జట్టు తమ ఆఖరి మ్యాచ్ ఆడింది. శ్రీలంకతో చివరి వన్డేలో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ కొత్తగా హోం సీజన్‌ను మొదలు పెట్టేందుకు సిద్ధమైంది.
లండన్ నుంచి నేరుగా...
బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం సెలక్టర్లు 16 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. వీరిలో దులీప్ ట్రోఫీలో ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మినహా మిగతా వారంతా శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. గురువారమే కెపె్టన్ రోహిత్ శర్మ చెన్నై చేరుకోగా... శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లిన విరాట్ కోహ్లి లండన్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాడు.
సుమారు 45 నిమిషాల పాటు కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రాక్టీస్‌ను పర్యవేక్షించగా... కొత్తగా బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఆటగాళ్లకు తగిన సూచనలిచ్చారు.
భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ ఫోటోలకు ‘కౌంట్‌డౌన్ మొదలైంది’ అనే వ్యాఖ్యను జోడించి బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో భారత్ సిరీస్ ఆడుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు, కివీస్‌లో జరిగే మూడు టెస్టులు కూడా వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment