4 Years Ban On Dutee Chand: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. గతేడాది డిసెంబరు 5, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో నాడాకు చెందిన అధికారులు ద్యుతీ నుంచి రెండుసార్లు శాంపిళ్లు సేకరించారు.
ఈ క్రమంలో ఆమె శరీరంలో నిషేధిత ఉత్ప్రేరకాల(SARMS) ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో జనవరి 3, 2023 నుంచే ద్యుతీపై నిషేధం అమల్లోకి వస్తుందని నాడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ద్యుతీ చంద్ గెలిచిన పతకాలన్నీ వెనక్కి తీసుకోనున్నారు.
క్లీన్‌చిట్ వస్తుంది
ఈ విషయంపై స్పందించిన ద్యుతీ తరఫు న్యాయవాది శుక్రవారం పీటీఐతో మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ద్యుతీ చంద్ ఈ మందులు వాడలేదని తెలిపారు. ఆమె తీసుకున్న ఏజెంట్లు స్పోర్టింగ్ అడ్వాంటేజ్ ఇవ్వవని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల నిషేధంపై తాము అప్పీలుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని.. భారత్‌కు గర్వకారణమైన ద్యుతీకి క్లీన్‌చిట్ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కడిగిన ఆణిముత్యంలా
‘దశాబ్దకాలంగా ద్యుతీ కెరీర్ దేదీప్యమానంగా కొనసాగుతోంది. తన సుదీర్ఘ కెరీర్‌లో.. క్లీన్ అథ్లెట్ ద్యుతీ.. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వందలసార్లు డోపింగ్ టెస్టులు ఎదుర్కొని కడిగిన ఆణిముత్యంలా తిరిగి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది’’అని సదరు న్యాయవాది ద్యుతిపై నమ్మకం ఉంచారు.
కాగా SARMS(సెలక్టివ్ ఆండ్రోజెన్ రెసిప్టార్ మ్యాడ్యులేటర్స్) అనేవి నాన్- స్టెరాయిడల్ సబ్‌స్టాన్సెన్స్. వీటిని సాధారణంగా ఆస్టియోపొరోసిస్(కీళ్లు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు), ఎనీమియా(రక్తహీనత) ఉన్న పేషెంట్ల చికిత్సలో వినియోగిస్తారని తెలుస్తోంది.
కాగా 27 ఏళ్ల ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్ రికార్డు తన పేరిటే ఉంది. 2011లో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ.
చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్!
Comments
Please login to add a commentAdd a comment