అబుదాబి: క్రిస్ గేల్‌కు కోపం వచ్చింది. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో ‘యూనివర్సల్ బాస్’ యమ సీరియస్ అయ్యాడు. అసహనంతో బ్యాట్‌ను నెలకేసి కొట్టాడు. ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన లీగ్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన గేల్ తనదైన శైలిలో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు తర్వాత చెలరేగిపోయాడు. జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న దశలో గేల్ జోరుకు రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బ్రేక్ వేశాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న గేల్‌ను అద్భుత యార్కర్‌తో ఔట్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన గేల్ తన బ్యాట్‌ను కసిగా నేలకేసి విసిరికొట్టాడు. తర్వాత బ్యాట్ హేండిల్‌కు తన హెల్మెట్ తగిలించి నిరాశగా మైదానం వీడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంతో గేల్ ఇన్నింగ్స్ వృధా అయింది.
తప్పు ఒప్పుకున్న గేల్
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినందుకు క్రిస్ గేల్‌పై అంపైర్లు చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. మైదానంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే గేల్.. బ్యాట్‌ను విసిరికొట్టడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చేసింది తప్పేనని అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో కోతతో అంపైర్లు సరిపెట్టారు.
వెయ్యి సిక్సర్ల మైలురాయి
టి20 క్రికెట్‌లో వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్ సరికొత్త చరిత్ర లిఖించాడు. 1000 సిక్స్‌ల మైలురాయి సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా పొలార్డ్ (690), మెకల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రూ రసెల్ (447) ఉన్నారు.
ఐపీఎల్‌లో 349 సిక్స్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డు చెక్కు చెదరలేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అతడు 349 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో జరుగుతోన్న మరే టి20 లీగ్‌లోనూ ఎవరూ ఇన్ని సిక్స్‌లు కొట్టలేదంటే గేల్ సత్తా ఎలాంటిదో అర్థమవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో అందుకే ‘సిక్సర పిడుగు’గా అతడు వెలుగొందుతున్నాడు. (చదవండి: రాజస్తాన్ రాయల్స్ ఊపిరి పీల్చుకుంది)
Comments
Please login to add a commentAdd a comment