హాఫ్‌ సెంచరీ ముంగిట గిల్‌ ఔట్‌! | IPL 2020 : Effective Start By Shubman Gill Against Rajasthan Royals | Sakshi
Sakshi News home page

హాఫ్‌ సెంచరీ ముంగిట గిల్‌ ఔట్‌!

Published Wed, Sep 30 2020 8:23 PM | Last Updated on Wed, Sep 30 2020 9:00 PM

IPL 2020 : Effective Start By Shubman Gill Against Rajasthan Royals - Sakshi

దుబాయ్ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌ ఇన్నింగ్స్‌ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగుతోంది. కోల్‌కతా ఓపెనర్లలో గిల్‌ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే, 34 బంతుల్లో 47 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీకి చేరువైన గిల్‌ను జోఫ్రా ఆర్చర్‌ బోల్తా కొట్టించాడు. రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా పెవిలియన్‌కు పంపాడు.  మరో ఓపెనర్‌ నరైన్‌ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ఆరంభం నుంచి పెద్దగా మెరుపులు లేకుండా సాగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు చేరుకోగానే ఉనాద్కట్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్‌ రాణాతో కలిసి గిల్‌  ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.

పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత గిల్‌, రాణాలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెవాటియా వేసిన 10 ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్‌ రాణా క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ స్కోరు 3 వికెట్ల నష్టానికి 98గా ఉంది.

ఇక ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రాజస్తాన్‌ 10, కేకేఆర్‌ 10 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. రాజస్తాన్‌పై కేకేఆర్‌ అత్యధిక స్కోరు 190, అత్యల్ప స్కోరు 125గా ఉంది. కాగా కేకేఆర్‌పై రాజస్తాన్‌ అత్యధిక స్కోరు 199 పరుగులు, అత్యల్ప స్కోరు 81గా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్‌ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement