Harbhajan Singh: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా? | IPL 2021: Harbhajan Singh Responds To A Fan Who Accused Him Of Responding Only To Verified Accounts On Twitter | Sakshi
Sakshi News home page

Harbhajan Singh: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా?

Published Sun, Apr 25 2021 6:18 PM | Last Updated on Sun, Apr 25 2021 7:19 PM

IPL 2021: Harbhajan Singh Responds To A Fan Who Accused Him Of Responding Only To Verified Accounts On Twitter - Sakshi

చెన్నై: టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌, ఐపీఎల్‌లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న హర్భజన్‌ సింగ్‌ను టార్గెట్‌ చేస్తూ ఓ అభిమాని ‍ట్విటర్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ వ్యక్తులతో మాత్రమే ఎందుకు సంభాషిస్తావంటూ అతను భజ్జీని నిలదీశాడు. భజ్జీ.. మధ్య తరగతి ప్రజలతో సంభాషించేందుకు కానీ, రిప్లై ఇచ్చేందుకు కాని ఆయిష్టత చూపుతాడని ఆరోపించాడు. ప్రొఫైల్‌పై బ్లూ టిక్‌ మార్క్‌ ఉన్న సెలబ్రిటీలపై ఉన్న ఆసక్తి... సామాన్య ప్రజలపై ఎందుకుండదని ప్రశ్నించాడు. ఇదేనా మీకున్న మానవత్వమంటూ నిలదీశాడు.

అయితే సదరు అభిమాని అడిగిన ప్రశ్నకు హర్భజన్‌ వినయంగా ప్రతి స్పందించాడు. తాను లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. పద్దతిగా సంభాషించే ప్రతి ఒక్కరికి తాను రిప్లై ఇస్తానని అన్నాడు. తాను ఏ క్లాస్‌కు చెందినవాడిని కాదని, ఎదుటి వ్యక్తి బాధను అర్ధం చేసుకోగల నీలాంటి సాధారణ వ్యక్తినేనని ఆ అభిమానికి బదులిచ్చాడు. సాధారణంగా అభిమానులతో హుందాగా వ్యవహరించే హర్భజన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాగా, భజ్జీ ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. ఆశించిన స్థాయిలో రాణించకపోవటంతో అతని స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారు.

చదవండి: 
భారత్‌కు ఆక్సిజన్‌ అందిద్దాం.. షోయబ్‌ అక్తర్‌ పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement