Photo Courtesy: BCCI/ PTI
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న(ఆదివారం) తాము తలపడిన మ్యాచ్ నిజంగాఆ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ తెలిపాడు. అసలు ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లే మ్యాచ్ కాదని, కాకపోతే అంత వరకూ వెళ్లడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కారణమ్నాడు. అతనొక చాంపియన్ ప్లేయర్ అని మరొకసారి నిరూపించుకున్నాడన్నాడు. మ్యాచ్ తర్వాత యాక్టింగ్ కెప్టెన్ హోదాలో మాట్లాడిన ధవన్.. తాము ఇది ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అని అన్నాడు.
తాము కొన్ని తప్పిదాలు చేశామని, అవి గేమ్‌లో భాగమేనన్నాడు. గేమ్ మొత్తంలో తమదే పైచేయి అని, చివరకు సూపర్ ఓవర్ వరకూ వెళ్లాల్సింది కాదన్నాడు. విలియమ్ససన్ కడవరకూ ఉండటంతోనే మ్యాచ్ అంతవరూ వెళ్లిందన్నాడు. ఏది ఏమైనా చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు.
మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లడం, దాన్ని తాము ఛేజ్ చేయడం మరింత ఆసక్తికరంగా అనిపించిందన్న ధవన్.. చిన్న చిన్న తప్పిదాలే ఈ మ్యాచ్‌లో ఫలితంపై ప్రభావం చూపాయమన్నాడు. సూపర్ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ రాణించకపోవడంతో తమకు ఎడ్జ్ దొరికిందని, అక్కడే తమ విజయానికి బాటలు పడిందన్నాడు. ఈ పిచ్‌పై ఆడటం అంత ఈజీగా లేదన్నాడు. పవర్ ప్లేలో ఆడటం ఇంకా క‘ష్టంగా ఉంటుందన్నాడు. ఇక్కడ పిచ్ కంటే అహ్మదాబాద్ పిచ్ ఎంతో కొంత నయం అనిపించిందని ధవన్ తేల్చిచెప్పాడు.
ఇక్కడ చదవండి: హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు
Comments
Please login to add a commentAdd a comment