photo courtesy:ipl twitter
ముంబై: గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొనసాగించిన ఫామ్‌నే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధవన్. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. 49 బంతుల్లో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్న జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రధానంగా పేస్ బౌలింగ్ స్వీప్ షాట్లు కొట్టడంతో ధవన్ కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ తాను క్లాస్ ఆటగాడినని, క్లాస్ అనేది ఎప్పటికీ శాశ్వతమని చెప్పుకునే శిఖర్ ధవన్.. అందుకు తగ్గట్టే బ్యాట్‌తో అలరిస్తూ యువ క్రికెటర్లకు పోటీగా నిలుస్తున్నాడు.
కాగా, పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సహచర ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ముచ్చటించిన ధవన్.. సరదా సరదాగా మాట్లాడాడు. ప్రస్తుతం ముంబైలోని వాంఖడే స్టేడియంలో దుమ్ములేపుతున్న ధవన్.. చెన్నై పిచ్‌లో ఎలా ఆడాలో ప్రిపరయ్యే ఉన్నానని పేర్కొన్నాడు. చెన్నై వికెట్ బ్యాటింగ్‌కు కష్టమని భావిస్తున్న తరుణంలో ఆ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘ చెన్నై వికెట్ చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నా. ఆ వికెట్ బాగా టర్న్ అవుతోంది. నేను టీవీలో చూసిన దాన్ని బట్టి చెన్నై వికెట్ ఎక్కువ స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఆ పిచ్ చాలా మందకొడిగా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రిపరయ్యే. అక్కడ ఎలా ఆడాలో నాకు తెలుసు. ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్ జట్లతో అక్కడే ఆడే మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపాడు.
పేస్ బౌలింగ్‌లో స్వీప్ షాట్లను అవలీలగా ఎలా కొడుతున్నావు అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ నాకు తెలుసు. వారు యార్కర్లు, ఆఫ్ సైడ్ యార్కర్లు వేసి ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు. ఇలా చేస్తే నా ట్రేడ్ మార్క్ షాట్ అయిన ఆఫ్ సైడ్ బౌండరీ కష్టం. నేను దాంతో పేస్‌ను ఉపయోగించుకుని స్వీప్ షాట్లు ఆడుతున్నా. ఆ తరహా షాట్లను ఎంజాయ్ చేస్తున్నా. అలా ఆడుతుంటే భలే అనిపిస్తోంది. నెట్స్‌లో ఎక్కువ అదే ప్రాక్టీస్ చేస్తున్నా.. అందుకే ఫీల్డ్‌లో సక్సెస్ అవుతున్నా’ అని పేర్కొన్నాడు.
ఇక్కడ చదవండి: పదే పదే బౌల్డ్ కావడంతో ఏమీ అర్థంకాని పరిస్థితి
అక్కడ ఉన్నది ఏబీ.. బౌలింగ్ ఎవరికిచ్చావ్!
Comments
Please login to add a commentAdd a comment