IPL 2021, DC vs PBKS: ధావన్‌ ధనాధన్‌... | Delhi Capitals beat Punjab Kings by 6 wickets | Sakshi
Sakshi News home page

IPL 2021, DC vs PBKS: ధావన్‌ ధనాధన్‌...

Published Mon, Apr 19 2021 5:34 AM | Last Updated on Mon, Apr 19 2021 9:07 AM

Delhi Capitals beat Punjab Kings by 6 wickets - Sakshi

ముంబై: పంజాబ్‌ గర్జించినా... ఢిల్లీ క్యాపిటల్స్‌ దంచికొట్టింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ బృందం ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.

ఆఖర్లో దీపక్‌ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్‌ 2 సిక్సర్లు), షారుఖ్‌ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 10 బంతులు మిగిలుండగానే 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన ధావన్, రెండో వికెట్‌కు స్మిత్‌ (9)తో 48 పరుగులు జతచేశాడు.  సెంచరీకి చేరువైన దశలో రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ధావన్‌ అవుటయ్యాడు. అనంతరం స్టొయినిస్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), లలిత్‌ యాదవ్‌ (6 బంతుల్లో 12 నాటౌట్‌; 2 ఫోర్లు) వేగంగా ఆడటంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అధిగమించింది.  

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) స్టొయినిస్‌ (బి) రబడ 61; మయాంక్‌ (సి) ధావన్‌ (బి) మెరీవాలా 69; గేల్‌ (సి) సబ్‌–రిపాల్‌ పటేల్‌ (బి) వోక్స్‌ 11; దీపక్‌ హుడా (నాటౌట్‌) 22; పూరన్‌ (సి) రబడ (బి) అవేశ్‌ ఖాన్‌ 9; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 195.

వికెట్ల పతనం: 1–122, 2–141, 3–158, 4–179.
బౌలింగ్‌: వోక్స్‌ 4–0–42–1; లుక్మాన్‌ మెరీవాలా 3–0–32–1; అశ్విన్‌ 4–0–28–0; రబడ 4–0–43–1; లలిత్‌ యాదవ్‌ 1–0–11–0; అవేశ్‌ ఖాన్‌ 4–0–33–1.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) గేల్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 32; ధావన్‌ (బి) రిచర్డ్‌సన్‌ 92; స్మిత్‌ (సి) రిచర్డ్‌సన్‌ (బి) మెరిడిత్‌ 9; పంత్‌ (సి) దీపక్‌ హుడా (బి) రిచర్డ్‌సన్‌ 15; స్టొయినిస్‌ (నాటౌట్‌) 27; లలిత్‌ యాదవ్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 198.

వికెట్ల పతనం: 1–59, 2–107, 3–152, 4–180.
బౌలింగ్‌: అర్షదీప్‌ సింగ్‌ 3–0–22–1; షమీ 4–0–53–0; జలజ్‌ సక్సేనా 3–0–27–0; రిచర్డ్‌సన్‌ 4–0–41–2; దీపక్‌ హుడా 2–0–18–0; మెరిడిత్‌ 2.2–0–35–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement