ముంబై: భారత్‌లో కరోనా కేసుల విజృంభన కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను(ఫేస్-2) సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా 29 మ్యాచ్‌లు మాత్రమే సాధ్యపడ్డాయి. దీంతో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ నెల 29న జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కాగా, యూఏఈ వేదికగా ఇదివరకే రెండు ఐపీఎల్ సీజన్లు (2020, 2014) జరిగాయి. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా కారణంగా 2020 సీజన్ కూడా యూఏఈలోనే పూర్తయింది. దీంతో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా ఆ దేశంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. అక్టోబర్‌లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ను ఎలాగైనా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇదే జరిగితే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్ లభించినట్లవుతుంది.
చదవండి: టీమిండియాకు ఆడేందుకు 50 మందికి పైగా రెడీగా ఉన్నారు..
Comments
Please login to add a commentAdd a comment