చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ క్వింటాన్ డీకాక్ ఆడలేదు. అతను క్వారంటైన్‌లో ఉండటంతో ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా, మంగళవారం(ఏప్రిల్ 13వ తేదీ) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఆడే మ్యాచ్‌లో డీకాక్ అవకాశం కల్పించే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించాడు ముంబై ఇండియన్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ జహీర్‌ఖాన్. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జహీర్ మాట్లాడుతూ.. ‘డీకాక్ క్వారంటైన్ పూర్తయ్యింది. నిన్న నెట్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. రేపటి మ్యాచ్ సెలక్షన్‌కు డీకాక్ అందుబాటులోకి వచ్చాడు’ అని తెలిపాడు.
ఆర్సీబీతో జరిగిన ఈ సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌కు జతగా క్రిస్ లిన్ ఓపెనర్‌గా వచ్చాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు సాధించి తన అవకాశాన్ని వినియోగించుకున్నాడు లిన్. టీ20 ఫార్మాట్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా పేరొందని లిన్.. రేపటి మ్యాచ్ తుది జట్టులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ డీకాక్ అందుబాటులోకి రావడంతో లిన్‌కు విశ్రాంతి ఇవ్వొచ్చు. ముంబై జట్టు బ్యాటింగ్ బలమంతా హార్డ్ హిట్టర్లే కాబట్టే లిన్ కంటే డీకాక్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment