Photo Courtesy: IPL
Breadcrumb
మార్ష్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన ఢిల్లీ
Published Wed, May 11 2022 7:02 PM | Last Updated on Wed, May 11 2022 11:14 PM
Live Updates
IPL 2022: రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ లైవ్ అప్డేట్స్
మార్ష్ మెరుపులు.. రాజస్థాన్‌ను మట్టికరిపించిన ఢిల్లీ
రాజస్థాన్ నిర్ధేశించిన 161 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. మరో 11 బంతులుండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ వార్నర్ (40 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించాడు. బౌల్ట్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, అశ్విన్ (50), పడిక్కల్ (48) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. అశ్విన్, పడిక్కల్ మినహా మిగతా ఆర్ఆర్ ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
శతకం చేజార్చుకున్న మార్ష్
62 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసిన మార్ష్.. చహల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కుల్దీప్ సేన్ చేతికి చిక్కి ఔటయ్యాడు.
లక్ష్యం దిశగా సాగుతున్న ఢిల్లీ
డేవిడ్ వార్నర్ (31 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), మిచెల్ మార్ష్ (51 బంతుల్లో 68; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నిలకడగా ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. 14 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 105/1. ఢిల్లీ గెలవాలంటే 36 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి.
ధాటిగా ఆడుతున్న మిచెల్ మార్ష్, వార్నర్
డేవిడ్ వార్నర్ (22 బంతుల్లో 23; ఫోర్, సిక్స్), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడుతుండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం దిశగా సాగుతుంది. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 74/1. ఢిల్లీ గెలవాలంటే 60 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది.
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఢిల్లీ
161 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి శ్రీకర్ భరత్ డకౌటయ్యాడు.
ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్
అశ్విన్ (50), పడిక్కల్ (48) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించింది. అశ్విన్, పడిక్కల్ మినహా మిగతా ఆర్ఆర్ ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో సకారియా, నోర్జే, మిచెల్ మార్ష్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
నాగర్కోటి సూపర్ క్యాచ్
నోర్జే బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమలేశ్ నాగర్కోటి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా పడిక్కల్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్‌కు చేరాడు.
142 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
స్కోర్ వేగం పెంచే క్రమంలో రాజస్థాన్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకుంటున్నారు. చేతన్ సకారియా బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (5 బంతుల్లో 9; సిక్స్) పెవిలియన్ బాట పట్టాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్ఆర్ స్కోర్ 146/5.
శాంసన్ ఔట్
గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా విఫలమవుతున్న రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లోనూ దారుణంగా నిరాశపరిచాడు. 4 బంతుల్లో ఫోర్ సాయంతో 6 పరుగులు చేసిన శాంసన్.. నోర్జే బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత ఆర్ఆర్ స్కోర్ 139/4.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్.. ఎట్టకేలకు తన ఐపీఎల్ 72 ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 38 బంతులను ఎదుర్కొన్న యాష్.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతి బంతికే మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అశ్విన్ ఉతుకుడు
వన్‌డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన అశ్విన్ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. మరో ఎండ్‌లో పడిక్కల్ (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అశ్విన్‌కు జతకలిశాడు. ఫలితంగా ఆర్ఆర్ స్కోర్ 13.2 ఓవర్లలోనే 100 పరుగులు దాటింది.
రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ఇన్నింగ్స్ 9వ ఓవర్ తొలి బంతికి రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతున్న యశిస్వి జైస్వాల్ (19 బంతుల్లో 19).. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అశ్విన్ (26)కు జతగా పడిక్కల్ క్రీజ్‌లో వచ్చాడు.
ధాటిగా ఆడుతున్న అశ్విన్
బట్లర్ ఔట్ కావడంతో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ తన సహజ శైలికి విరుద్ధంగా ధాటిగా ఆడుతున్నాడు. 16 బంతులు ఎదుర్కొన్న యాష్.. 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 24 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో యశిస్వి జైస్వాల్ (16) నిదానంగా ఆడుతున్నాడు. 7 ఓవర్ల తర్వాత ఆర్ఆర్ స్కోర్ 49/1.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో శార్ధూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (11 బంతుల్లో 7; ఫోర్) పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్ఆర్ స్కోర్ 11/1. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (2), అశ్విన్ ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంస్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, వాన్ డెర్ డస్సెన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చహల్, కుల్దీప్ సేన్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్జే
Related News By Category
Related News By Tags
-
IPL 2022 Playoffs: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో!
IPL 2022 Playoffs Qualification Scenarios In Telugu: ఐపీఎల్-2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడున ఉండగా.. డిఫె...
-
వార్నర్ అదృష్టం.. రాజస్తాన్ కొంపముంచింది
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే వార్నర్ అదృష్టం రాజస్తాన్ ర...
-
IPL 2022: ఢిల్లీ ఆశలు పదిలం
ముంబై: సీజన్లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదే శైలిని కొనసాగించింది! తాజా ఫలితం అనంతరం సరిగ్గా సగం మ్యాచ్‌లలో విజయం, సగం పరాజయాలతో...
-
RR VS DC: అశ్విన్ ఖాతాలో అరుదైన ఘనత.. జడేజా తర్వాత..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 2022 సీజన్లో భాగంగా ఇవాళ (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాది...
-
రాజస్థాన్‌ను ఢీకొట్టనున్న ఢిల్లీ.. నరాలు తెగే ఉత్కంఠ తప్పదా..?
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (మే 11) మరో హై ఓల్టేజీ పోరు జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇవాళ అమీతుమీ తేల్చుకోనున...
Comments
Please login to add a commentAdd a comment