Breadcrumb
రాజస్థాన్‌కు షాకిచ్చిన కేకేఆర్.. కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం
Published Mon, May 2 2022 7:01 PM | Last Updated on Mon, May 2 2022 11:26 PM
Live Updates
IPL 2022: రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
రాజస్థాన్‌కు షాకిచ్చిన కేకేఆర్
153 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (34) పర్వాలేదనిపించగా, నితీశ్ రాణా (48 నాటౌట్), రింకూ సింగ్ (42 నాటౌట్) కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్, బౌల్ట్, కుల్దీప్ సేన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. శాంసన్ (54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. పడిక్కల్ (2), బట్లర్ (22), కరుణ్ నాయర్ (13), రియాన్ పరాగ్ (19) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో హెట్‌మైర్ (13 బంతుల్లో 27 నాటౌట్), అశ్విన్ (6 నాటౌట్) వేగంగా పరుగుల చేసే ప్రయత్నం చేశారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (1/24), అనుకుల్ రాయ్ (1/28), శివమ్ మావి (1/33), సౌథీ (2/46) రాణించారు.
శ్రేయస్ ఔట్
బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (34) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 96/3. క్రీజ్‌లో నితీశ్ రాణా (31), రింకూ సింగ్ (4) ఉన్నారు.
లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్
శ్రేయస్ అయ్యర్ (33), నితీశ్ రాణా (25) నిలకడగా ఆడుతూ కేకేఆర్‌ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయమైన 53 పరుగులు జోడించి కేకేఆర్‌ను లక్ష్యం దిశగా నడిపిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 85/2.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఇంద్రజిత్ ఔట్
6వ ఓవర్లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి బాబా ఇంద్రజిత్ (15) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 32/2. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్ (10), నితీశ్ రాణా ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ నాలుగో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 21/1. క్రీజ్‌లో బాబా ఇంద్రజిత్ (10), శ్రేయస్ అయ్యర్ (5) ఉన్నారు.
రాణించిన శాంసన్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన రాజస్థాన్
కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. శాంసన్ (54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. పడిక్కల్ (2), బట్లర్ (22), కరుణ్ నాయర్ (13), రియాన్ పరాగ్ (19) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో హెట్‌మైర్ (13 బంతుల్లో 27 నాటౌట్), అశ్విన్ (6 నాటౌట్) వేగంగా పరుగుల చేసే ప్రయత్నం చేశారు. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (1/24), అనుకుల్ రాయ్ (1/28), శివమ్ మావి (1/33), సౌథీ (2/46) రాణించారు.
వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
17వ ఓవర్ ఆఖరి బంతికి రియాన్ పరాగ్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. ఆ మరుసటి ఓవర్ (18) తొలి బంతికే సంజూ శాంసన్ (54) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. శివమ్ మావి బౌలింగ్‌లో రింకూ సింగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్‌కు చేరాడు. 18 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 122/5. హెట్‌మైర్ (2), అశ్విన్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
రియాన్ పరాగ్ ఔట్
భారీ సిక్సర్ బాదిన తర్వాతి బంతికే రియాన్ పరాగ్ పెవిలియన్‌కు చేరాడు. సౌథీ బౌలింగ్‌లో అనుకుల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి రియాన్ వెనుదిరిగాడు. 17 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 115/4. శాంసన్ (54), హెట్‌మైర్ క్రీజ్‌లో ఉన్నారు.
శాంసన్ హాఫ్ సెంచరీ
రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో ఐపీఎల్లో 17వ అర్ధ శతకాన్నినమోదు చేశాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 100/3. శాంసన్ (51), రియాన్ పరాగ్ (8) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
14వ ఓవర్ తొలి బంతికి రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి కరుణ్ నాయర్ (13) ఔటయ్యాడు.
బట్లర్‌ను బోల్తా కొట్టించిన సౌథీ
విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ (25 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 22)ను సౌథీ బోల్తా కొట్టించాడు. ఈ సీజన్లో బట్లర్ తొలిసారి తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన బట్లర్.. శివమ్ మావి అద్భుతుమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ బాట పట్టాడు. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 58/2. శాంసన్ (29), కరుణ్ నాయర్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
ధాటిగా ఆడుతున్న శాంసన్
రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ వచ్చీ రాగానే తన సహజ శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. మరో ఎండ్‌లో బట్లర్ (17 బంతుల్లో 13) స్లోగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 38/1.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. పడిక్కల్ (2).. ఉమేశ్ యాదవ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2.1 ఓవర్ తర్వాత రాజస్థాన్ స్కోర్ 7/1. క్రీజ్‌లో బట్లర్, శాంసన్ ఉన్నారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, పడిక్కల్, సంజూ శాంసన్, కరుణ్ నాయర్, హెట్‌మైర్, రియాన్ పరాగ్, అశ్విన్, బౌల్ట్, ప్రసిద్ద్, చహల్, కుల్దీప్ సేన్
కేకేఆర్: ఆరోన్ ఫించ్, అంకుల్ రాయ్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, బాబా ఇంద్రజిత్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, శివమ్ మావి
Related News By Category
Related News By Tags
-
IPL 2022: 2012, 2014లో కేకేఆర్.. ఇప్పుడు గుజరాత్.. మరి టైటిల్ కూడా!
IPL 2022 GT Vs RR: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్-2022లో పద్నాలుగింట 10 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్...
-
IPL 2022: నాకు ఆ అమ్మాయంటే ఇష్టం.. కానీ పెళ్లి చేసుకోను.. ఏంటిది?
IPL 2022 KKR Vs RR- Rinku Singh: రింకూ సింగ్ విషయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వైఖరిని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణిస్తూ జట్టుకు ఉపయోగపడే రి...
-
"ఈ అవకాశం కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాను"
ఐపీఎల్-2022లో వరుస ఐదు ఓటముల తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం నమోదు చేసింది. సోమవారం వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే కే...
-
ఏంటి ప్రసిద్ధ్.. త్రో చేయాల్సింది బౌల్ట్‌కు కాదు.. వికెట్లకు..!
ఐపీఎల్-2022లో భాగంగా కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో.. కేకేఆర్ బ్యాటర్ బాబా ఇంద్ర...
-
ప్లే ఆఫ్ రేసులో నిలిచిన కేకేఆర్.. రాజస్తాన్‌పై ఘన విజయం
ముంబై: బౌలర్ల దెబ్బకు మెరుపుల ప్రభ తగ్గిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) గెలిచింది. తద్వారా ఐదు వరుస పరాజయాల పరంపరకు చెక్ పెట్టింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్...
Comments
Please login to add a commentAdd a comment