IPL 2022: Kolkata Knight Riders Beat Rajasthan Royals By 7 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2022: ప్లే ఆఫ్‌ రేసులో నిలిచిన కేకేఆర్‌.. రాజస్తాన్‌పై ఘన విజయం

Published Tue, May 3 2022 7:41 AM | Last Updated on Tue, May 3 2022 10:53 AM

Kolkata Knight Riders beat Rajasthan Royals by 7 wickets - Sakshi

Courtesy: IPL Twitter

ముంబై: బౌలర్ల దెబ్బకు మెరుపుల ప్రభ తగ్గిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) గెలిచింది. తద్వారా ఐదు వరుస పరాజయాల పరంపరకు చెక్‌ పెట్టింది. సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (49 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. తర్వాత కోల్‌కతా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. నితీశ్‌ రాణా (37 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (23 బంతుల్లో 42 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 6.2 ఓవర్లలో 66 పరుగుల అజే య భాగస్వామ్యంతో కోల్‌కతాను గెలిపించారు.   
నడిపించిన నాయకుడు 
ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఇన్నింగ్స్‌ బోర్‌ కొట్టించింది. ఉమేశ్‌ , అనుకుల్‌ రాయ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాయల్స్‌ మెరుపులు కరువయ్యాయి. 7/1... మూడు ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరిది. పడిక్కల్‌ (2) అవుటయ్యాడు కానీ ‘హిట్టర్‌’ బట్లర్‌ (25 బంతుల్లో 22; 3 ఫోర్లు) 8.3 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా కూడా ఇన్నింగ్స్‌లో వేగమే లేదు. కెప్టెన్‌ సామ్సన్‌ అడపాదడపా కొట్టిన ఫోర్లతో కాస్త గాడిన పడింది. చివర్లో పరాగ్‌ (12 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు), హెట్‌మైర్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులతో రాజస్తాన్‌ స్కోరు 150 దాటింది. 
రాణించిన రాణా, రింకూ 
కఠినమైన లక్ష్యం కానప్పటికీ నైట్‌రైడర్స్‌ ఛేదన చప్పగా సాగింది. పవర్‌ ప్లేలో ఓపెనర్లు ఫించ్‌ (4), బాబా ఇంద్రజిత్‌ (15) వికెట్లను కోల్పోయి 32/2 స్కోరు చేసింది. అనంతరం క్రీజులో కుదురుకున్న కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చినప్పటికీ రాణాకు జతయిన రింకూ సింగ్‌ ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) శివమ్‌ మావి (బి) సౌతీ 22; పడిక్కల్‌ (సి అండ్‌ బి) ఉమేశ్‌ 2; సామ్సన్‌ (సి) రింకూ సింగ్‌ (బి) శివమ్‌ మావి 54; కరుణ్‌ నాయర్‌ (సి) రింకూ సింగ్‌ (బి) అనుకుల్‌ 13; పరాగ్‌ (సి) అనుకుల్‌ (బి) సౌతీ 19; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 27; అశ్విన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–7, 2–55, 3–90, 4–115, 5–115. బౌలింగ్‌: ఉమేశ్‌ 4–1–24–1, అనుకుల్‌ రాయ్‌ 4–0–28–1, నరైన్‌ 4–0–19–0, శివమ్‌ మావి 4–0–33–1, సౌతీ 4–0–46–2. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: ఇంద్రజిత్‌ (సి) అశ్విన్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 15; ఫించ్‌ (బి) కుల్దీప్‌ సేన్‌ 4; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) సామ్సన్‌ (బి) బౌల్ట్‌ 34; నితీశ్‌ రాణా (నాటౌట్‌) 48; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 42; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–16, 2–32, 3–92. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–25–1, ప్రసిధ్‌ కృష్ణ 4–0–37–1, కుల్దీప్‌ సేన్‌ 3.1–0–28–1, అశ్విన్‌ 4–0–33–0, చహల్‌ 4–0–31–0. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement