IPL 2022: Who Is Lucknow Super Giants Pacer Mohsin Khan, Details Inside - Sakshi
Sakshi News home page

Who Is Mohsin Khan: ఢిల్లీ క్యాపిటల్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ మొహసిన్‌‌ ఖాన్..?

Published Mon, May 2 2022 10:40 AM | Last Updated on Mon, May 2 2022 2:33 PM

IPL 2022: Who is LSG pacer Mohsin Khan - Sakshi

మొహిసిన్‌ ఖాన్‌(Photo Courtesy: IPL Twitter)

ఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ మొహసిన్‌‌ ఖాన్ అదరగొడుతున్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో మొహ్సిన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన మొహసిన్‌‌..16 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ను అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ను మొహసిన్‌‌ మలుపు తిప్పేశాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ ఖాన్.. 8 వికెట్లు సాధించాడు. 

ఎవరీ మొహసిన్‌ ఖాన్..?
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ యువ పేసర్‌ను ఐపీఎల్‌-2022 మెగా వేలంలో లక్నో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో 2018 నుంచి 2020 సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌కు మొహసిన్‌ ఖాన్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక దేశీవాళీ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్‌ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 17 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడు 26 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 28 టీ20‍ల్లో 34 వికెట్లు సాధించాడు.

చదవండి: IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement